భారత భూమిపై ఓ విదేశీ టెన్నిస్ భామ వివాదస్పద వ్యాఖ్యలు..!!

ఉత్తరాది హిమాలయాల మొదలు దక్షణాది కన్యాకుమారి వరకూ అడుగడుగునా ఎంతో చరిత్ర, విశిష్టతలు దాగున్న దేశం మనది. అటువంటి పవిత్ర భారత భూమిపై ఓ విదేశీ టెన్నిస్ భామ వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. భారతదేశం అపరిశుభ్రం.. అంటూ రెండు మాటలతో విషం చిమ్మింది.
ఇటీవల పూణే, బెంగళూరు, ఇండోర్‌ నగరాల వేదికగా ITF టోర్నమెంట్‌ జరిగింది. ఈ టోర్నీలో పాల్గొనడానికి సెర్బియా టెన్నిస్ క్రీడాకారిణి డెజానా రాడనోవిచ్ భారత దేశానికి విచ్చేసింది. ఇక్కడ దాదాపు మూడు వారాల పాటు ఉన్న ఆమె స్వదేశానికి వెళ్లాక.. సోషల్ మీడియాలో భారత దేశంపై విషం కక్కింది. భారతదేశం అపరిశుభ్రంగా ఉందని, అక్కడి ఆహారం, ట్రాఫిక్ తలుచుకుంటే మరోసారి ఆ దేశానికి వెళ్లాలనిపించదని రాసుకొచ్చింది. అదే సమయంలో తమ దేశమైన సెర్బియాకు రావాలని, అక్కడి శైలి, అలవాట్లు నచ్చకపోతే జాత్యహంకారుడివి అని అర్థం..? అని వ్యాఖ్యానించింది. రాడనోవిచ్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె వెంటనే భారత దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేనియెడల ఆమె మరోసారి భారత దేశాన్ని సందర్శించడకుండా నిషేధం విధించాలని కోరుతున్నారు. ఈ వివాదం సోషల్ మీడియాలో అగ్గి రేజేస్తోంది. సెర్బియా క్రీడాకారిణి వ్యాఖ్యలను పలు దేశాల ప్రజలు తప్పుబడుతున్నారు..