వాహనాలు ‘కారు’చౌక.!.జులై 1 నుంచి అమల్లోకి ఆ రాష్ట్రంలో వాహనాల కొత్త పాలసీ..!.

దిల్లీలో జులై 1 నుంచి అమల్లోకి తీసుకువస్తామన్న కొత్త వాహన పాలసీ భయంతో చాలామంది కార్ల యజమానులు తమ వాహనాలను ఇప్పటికే కారుచౌకగా అమ్మేశారు..పదేళ్లు పైబడిన డీజిలు, 15 ఏళ్లు పైబడిన పెట్రోలు వాహనాలకు బంకుల్లో ఇంధనం పోసేది లేదని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ మేరకు గడువు తీరిన, తీరబోతున్న కార్లను నామమాత్రపు ధరలకు పలువురు అమ్ముకున్నారు. ఈ క్రయ విక్రయాలను కొందరు సోషల్‌ మీడియా వేదికగా పంచుకొన్నారు. కొత్త వాహన పాలసీపై దిల్లీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావటంతో చివరి క్షణంలో భాజపా సర్కారు వెనక్కు తగ్గింది.

ఇదేదో ముందే తెలిస్తే తమ కార్లను చౌకగా అమ్ముకునే దుస్థితి వచ్చేది కాదని బాధిత యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ప్రకటనతో తనలాంటి ఎంతోమంది వాహనదారులు నష్టపోయారని దిల్లీకి చెందిన నితిన్‌ గోయల్‌ తెలిపారు. ఈయన రూ.65 లక్షల జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ను రూ.8 లక్షలకే అమ్మేశారు. రితేశ్‌ గందోత్ర అనే మరో యజమాని రూ.55 లక్షల లగ్జరీ ఎస్‌యూవీ కారును నామమాత్రపు రేటుకు విక్రయించారు…