దిల్లీ​ బిల్లు’కు రాష్ట్రపతి ఆమోదం.. అమల్లోకి డేటా ప్రొటెక్షన్‌ చట్టం.

దిల్లీ సర్వీస్​ బిల్లు చట్టరూపం దాల్చింది. నేషనల్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతకం చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వీటితో పాటు డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లు, జనన మరణాల నమోదు సవరణ బిల్లు, జన్ విశ్వాస్ నిబంధనల సవరణ బిల్లులపై కూడా రాష్ట్రపతి సంతకం చేశారు.వీరిలో ముఖ్యమంత్రి మినహా మిగిలిన ఇద్దరు కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటారు. మెజారిటీ సభ్యుల నిర్ణయం మేరకే ఉద్యోగుల బదిలీలు, నియామకాలు జరుగుతాయని ఆర్డినెన్స్‌లో ఉంది. వీరి మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే లెఫ్టినెంట్ గవర్నర్​దే తుది నిర్ణయమని ఆర్డినెన్స్​లో ఉంది. దీని ప్రకారం అధికారమంతా కేంద్రం చేతుల్లోనే ఉంటుంది. అందుకే ఈ ఆర్డినెన్స్‌పై ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే ఆర్డినెన్స్‌ స్థానంలో చట్టం తీసుకొచ్చేలా.. ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ‘దిల్లీ సర్వీసుల బిల్లు’ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ బిల్లును విపక్ష కూటమి ‘ఇండియా’ తీవ్రంగా వ్యతిరేకించింది. తొలుత లోక్‌సభ, ఆ తర్వాత రాజ్యసభలో ప్రతిపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లుకు ఆమోదం లభిచింది. తాజాగా రాష్ట్రపతి సంతకంతో బిల్లు చట్టంగా మారింది