ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి…!!

దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసిన ఢిల్లీ మెహ్రౌలీ హత్య కేసులో విచారణ చేస్తున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హత్యకు ముందు అప్తాబ్‌ పూనావాలా, శ్రద్ధ ఇద్దరూ ఢిల్లీలో ఒక ఫ్లాట్‌లో ఉన్న సంగతి తెలిసిందే…ఐతే పోలీసులు ఫ్లాట్‌ విషయంలో క్లూస్‌ కోసం దర్యాప్తు చేస్తుండగా.. నీటిబిల్లుల విషయం వారిని ఆశ్చర్యపరిచింది. మొత్తం రూ. 300 పెండింగ్ వాటర్‌ బిల్‌ ఉండటంతో పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ. 300 బిల్‌ అనేది పెద్ద మొత్తం కాకపోయిన.. ప్రతినెల 20 వేల లీటర్లు నీరు ఉచితమైనప్పటికీ నీటిని ఎందుకు అధికంగా ఉపయోగించాడనే విషయం పోలీసులకు అంతు చిక్కడం లేదు.

మృతదేహాన్ని కట్‌ చేసే శబ్ద రాకుండా ఉండేందుకు నీళ్లను అలా ఊరికే వదిలేశాడా లేక శరీరం నుంచి వచ్చే రక్తాన్ని కడగటానికి అంత పెద్ద మొత్తంలో నీరు అవసరమైందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ విషయమై ఆ ఆఫ్లాట్‌ ఓనర్‌ని కూడా విచారించగా… ఆయన కూడా ఇంత పెద్ద మొత్తంలో నీటి బిల్లులా అని ఆశ్చర్యపోయారు. తాను ఫ్లాట్‌ని వారికి నెలకు రూ.9000లకు అద్దెకు ఇచ్చానని, అగ్రిమెంట్‌లో ఇద్దరి పేర్లు ఉన్నాయని చెప్పారు. అలాగే అప్తాబ్‌ ప్రతి నెల 8, 10 తేదీ లోపే అద్దె చెల్లించేయడంతో తాను ఎప్పుడూ ఫ్లాట్‌కి వచ్చే పరిస్థితి ఏర్పడలేదన్నారు.

కాగా శ్రద్ధ హత్య జరిగిన ఆరు నెలల తర్వాత ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అదీ కూడా ఆమె స్నేహితులు తమతో టచ్‌లో లేదంటూ శ్రద్ధ తండ్రి వికాస్‌ వాకర్‌కి చెప్పడంతోనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారుజ ఐతే శ్రద్ధ శరీర భాగాల్లో ఇంకా చాలా దొరకలేదని, అలాగే అడవిలో దొరికిన భాగాలు శ్రద్ధవి కాదా లేదా అనే విషయాన్ని నిర్ధారించేందుకు సుమారు 15 రోజులు కొనుగోలు చేసిన ఫ్రిజ్‌, కత్తి బలమైన సాక్ష్యాధారాలని చెబుతున్నారు. తమకు ఇప్పటి వరకు శ్రద్ధ ధరించిన దుస్తులు, మృతదేహాన్ని కోసిన కత్తి దొరకాల్సి ఉందన్నారు. పోలీసులు సాక్ష్యాధారాలను మరింత బలోపేతం చేసేందుకు లై డిటెక్టర్‌ పరీక్షకు సైతం అనుమతి కోరారు….