ఢిల్లీలో యువతి నర్గీస్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు..!!

Delhi student murder.

దేశ రాజధాని ఢిల్లీలో 25 ఏళ్ల యువతి నర్గీస్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. విద్యార్థిని హత్య చేసిన వ్యక్తిని ఇర్ఫాన్‌గా పోలీసులు గుర్తించారు. దగ్గరి బంధువైన ఇర్ఫాన్ యువతి తన పెళ్లి ప్రపోజల్‌ను తిరస్కరించిందని పగ పెంచుకున్నాడు. దీంతో హత్య చేయాలని భావించాడు. ఇర్ఫాన్ యువతి కదలికలను ప్రతి రోజు గమనించేవాడు. యువతి కమలా నెహ్రూ కాలేజ్‌లో గతేడాది డిగ్రీ పూర్తి చేసింది. డిగ్రీ తర్వాత యువతి స్టెనో గ్రఫీ క్లాస్ వెళ్లే క్రమంలో ప్రతి రోజు పార్క్ దాటుతుందని గుర్తించాడు. ఫుడ్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తుండటం, పర్మినెంట్ జాబ్ లేకపోవడంతో యువతి పెళ్లి ప్రపోజల్‌ను తిరస్కరించినట్లు తెలిసింది. దీంతో శుక్రవారం యువతిని అరబిందో కాలేజ్ వద్ద గల పార్క్‌లో రాడ్‌తో కొట్టి ఇర్ఫాన్ చంపినట్లు పోలీసులు తెలిపారు.