ఢిల్లీలో గల జామా మసీదులోకి అమ్మాయిల ప్రవేశంపై విధించిన నిషేధం ఎత్తివేత..!

ఢిల్లీలో గల జామా మసీదులోకి అమ్మాయిల ప్రవేశంపై విధించిన నిషేధాన్ని ఎత్తివేశారు…
లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా మసీదు షాహీ ఇమామ్‌ బుఖారీతో మాట్లాడి..
మసీదులోకి అమ్మాయిల ప్రవేశాన్ని నిషేధిస్తూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించుకోవాలని కోరారు.
ఈ మేరకు ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు అంగీకరించారని రాజ్‌భవన్‌ వర్గాలు పేర్కొన్నాయి…అంతకు ముందు మసీదులో అమ్మాయిల నిషేధంపై ఢిల్లీ మహిళా కమిషన్‌ చీఫ్ స్వాతి మలివాల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజించే హక్కు పురుషుడికి ఎంత ఉందో.. స్త్రీకి అందే ఉందన్నారు. జామా మసీదు ఇమామ్‌కి నోటీసు జారీ చేస్తానన్నారు. మహిళల ప్రవేశంపై నిషేధించే హక్కు ఎవరికీ లేదన్నారు…నిషేధంపై విమర్శలు పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తగా.. ఒంటరిగా ఉన్న బాలికల ప్రవేశాన్ని నిషేధించామని జామా మసీదు పీఆర్వో సబీవుల్లాఖాన్ తెలిపారు…