డేరా బాబాకు మళ్ళీ పెరోల్‌.

అత్యాచార కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా బాబాకు మళ్ళీ పెరోల్‌ లభించింది. హర్యానాలోని సనారియా జైలులో ఖైదీగా ఉన్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు శుక్రవారం మరోసారి పెరోల్ మంజూరు చేసినట్లు అధికారులు తెలిపారు. డేరా బాబా తన సిర్సా ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. గత మూడు నెలల క్రితం పెరోల్ మీద రిలయ్యారు.. మళ్ళీ తాజాగా 40 రోజుల పాటు పెరోల్ మంజూరు చేయబడింది. డేరా బాబాకు నిబంధనల ప్రకారమే పెరోల్ ఇచ్చినట్లు రోహ్‌తక్ డివిజనల్ కమిషనర్ సంజీవ్ వర్మ తెలిపారు.