భారత్‌ వైమానిక విన్యాసాలు!..ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై వరుస దాడులు, హైజాక్‌ వంటి ఘటనలకు స్ట్రాంగ్ వార్నింగ్..!!

ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకొని హౌతీ ఉగ్రవాదులు ఇటీవల దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. నౌకలపై వరుస దాడులు, హైజాక్‌ వంటి ఘటనలపై అంతర్జాతీయంగా ఆందోళన వ్యక్తమవుతోంది…ఈ పరిణామాల నడుమ భారత్‌ సహా ఫ్రాన్స్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) సంయుక్తంగా భారీ వైమానిక విన్యాసాలు చేపట్టాయి. డెసర్ట్ నైట్‌ (Desert Knight) పేరుతో నిర్వహిస్తున్న గగనతల విన్యాసాల్లో.. మూడు దేశాలకు చెందిన అత్యాధునిక యుద్ధ విమానాలు, ఫైటర్‌ జెట్‌లు పాల్గొన్నాయి.

భారత వాయుసేనకు చెందిన Su-30 ఎంకేఐ, MiG-29, జాగ్వార్‌ ఫైటర్‌ జెట్లతో పాటు సీ-130-జే రవాణా విమానాలు, గాల్లోనే ఇంధనం నింపే సామర్థ్యం కలిగిన విమానాలు పాల్గొన్నాయి. మూడు దేశాల వాయుసైన్యం మధ్య సమన్వయం, పరస్పర సహకారం మెరుగుపరచుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారత వాయుసేన (Indian Air Force) వెల్లడించింది.