సోషల్ మీడియాలో దేవి నాగవల్లి పై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్…ఓ పెద్ద హీరోనో, పెద్ద రాజకీయ నాయకుడో ఉంటే నువ్ ఇలానే మాట్లాడుతావా? మాట్లాడగలవా? అని కామెంట్లు…

సోషల్ మీడియాలో దేవి నాగవల్లి పై ఒక రేంజ్ లో ట్రోలింగ్స్ జరుగుతుంటాయి అన్న విషయం కూడా తెలిసిందే.
నాగవల్లి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆమెపై ఉన్న నెగిటివ్ ఇమేజ్ కాస్త పోయింది పాజిటివ్ ఇమేజ్ ఏర్పడింది.బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత మరింత పాజిటివిటి ఏర్పడింది.దేవీ నాగవల్లి చేసే ఇంటర్వ్యూలు, చిన్న సెలెబ్రిటీల మీద చూపించే ప్రతాపంతో ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది.ఇలా ఉంటే తాజాగా దేవి నాగవల్లి హీరో విశ్వక్ సేన్ విషయంలో ప్రవర్తించిన తీరుపై కూడా ట్రోలింగ్స్ ని ఎదుర్కోటోంది.
హీరో విశ్వక్ సేన్ తాజాగా నటించిన చిత్రం అశోకవనంలో అర్జున కళ్యాణం.ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తాజాగా విశ్వక్ సేన్ ఒక ఫ్రాంక్ వీడియోని చేయగా ఆ వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.నాగవల్లి ప్రవర్థన మీద నెట్టింట్లో దారుణమైన కామెంట్లు వస్తున్నాయి.ఇది జర్నలిజమా? అని ఒకరు ప్రశ్నించగా.అది నీ స్టూడియోనా? అని ఇంకొకరు ప్రశ్నిస్తున్నారు.నువ్ టీవీ9లో పని చేస్తున్నావ్..అది నీ స్టూడియో కాదు అని మరి కొందరు ట్రోల్స్ చేస్తున్నారు.విశ్వక్ సేన్ స్థానంలో ఓ పెద్ద హీరోనో, పెద్ద రాజకీయ నాయకుడో ఉంటే నువ్ ఇలానే మాట్లాడుతావా? మాట్లాడగలవా? అని కామెంట్లు పెడుతున్నారు.ఏదిఏమైనప్పటికీ విశ్వక్ సేన్ ఈ విషయంలో దేవి నాగవల్లి ప్రవర్తించిన తీరుపై అభిమానులు తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు.