మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు..

సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌పై సైబర్ క్రైమ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ‘హరేరామ హరేకృష్ణ’ మంత్రాన్ని ‘ఓ పారి’ అనే ఆల్బమ్‌లో ఐటెం సాంగ్‌గా చిత్రీకరించారని, హిందువుల మనోభావాలు దెబ్బ తీశారని పేర్కొంటూ నటి కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు సైబర్ క్రైమ్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు న్యాయసలహా తీసుకుని తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.