దీపావ‌ళి పండుగ‌కు ముందే ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది…!

ఢిల్లీలో వాయు కాలుష్యం ఎక్కువైంది. దీపావ‌ళి పండుగ‌కు ముందే వాయు నాణ్య‌త క్షీణించింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి పేర్కొన్న‌ది. పీఎం 2.5, పీఎం 10 కేట‌గిరీల్లో ఢిల్లీ వాయు నాణ్య‌త 252, 131గా ఉన్న‌ట్లు వాతావ‌ర‌ణ అదికారులు చెప్పారు. న‌వంబ‌ర్ 2, 3వ తేదీల్లో ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో వాయు కాలుష్యం అధికంగా ఉంటుంద‌ని ఐఎండీ తెలిపింది. న‌వంబ‌ర్ 4వ తేదీన కూడా వెరీ పూర్ క్యాట‌గిరీలో ఎయిర్ క్వాలిటీ ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది. 5, 6వ తేదీల్లోనూ వాయు నాణ్య‌త క్షీణించినా… వెరీ పూర్ క్యాట‌గిరీలోనే ఉంటుంద‌ని ఐఎండీ పేర్కొన్న‌ది…