ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు..

*లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. సోమవారం ఉదయం 11గంటలకు తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. సీబీఐ తాజా నోటీసులపై సిసోడియా స్పందించారు. ఇంతకుముందు నిర్వహించిన సోదాల్లో సీబీఐకి ఏం దొరకలేదని.. అందుకే ఇలాంటి చర్యలకు దిగుతోందని విమర్శించారు. అయినప్పటికీ దర్యాప్తు సంస్థ విచారణకు అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పారు.*