ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు..

బిగ్ బ్రేకింగ్

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు..

మంది ఈడీ అధికారులు సెర్చ్‌ వారెంట్‌తో ఢిల్లీ ఫ్లాగ్‌స్టాఫ్‌ రోడ్‌లోని కేజ్రీవాల్‌ అధికారిక నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించి సమన్లు అందించారు. అనంతరం రాత్రి 9.11 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. రాత్రి 11 గంటలకు ఈడీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. కేజ్రీవాల్‌ అరెస్టు నేపథ్యంలో ఆయన నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేజ్రీవాల్‌ నివాసం వద్ద స్థానికంగా 144 సెక్షన్‌ విధించారు. నినాదాలు చేస్తున్న ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన మనీ లాండరింగ్‌ వ్యవహారంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (55)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) గురువారం (మార్చ 21) ఆయన నివాసంలో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో కేజ్రీవాల్‌ను అరెస్టు చేయకుండా రక్షణ కల్పించలేమని ఢిల్లీ హైకోర్టు తేల్చిచెప్పిన కొన్ని గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అదుపులోకి తీసుకోవడం గమనార్హం. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తనను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద రిట్ పిటిషన్ దాఖలు చేశారు. కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు గురువారం రాత్రికే పిటీషన్‌పై సుప్రీంను అత్యవసర విచారణ కోరగా అది జరగలేదు. కేజ్రీవాల్‌కు ఈ రోజు (శుక్రవారం) ఉదయం
వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో ప్రవేశపెట్టనున్నారు..

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలని ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లుగా సమచారం… ఆయన జైల్లో ఉండటం వల్ల పాలించడం ఇబ్బందిగా మారుతుందని ఉద్దేశంతోటే హైకోర్టులో ఫీల్ దాఖలు చేసినట్లుగా నిపుణులు తెలుపుతున్నారు..