ఢిల్లీకి బ‌య‌లుదేరిన కేసీఆర్‌..3 రోజుల షెడ్యూల్..!!!.

సీఎం కేసీఆర్ ఢిల్లీ చేరుకున్నారు.
మూడు రోజుల పాటు సీఎం కేసీఆర్ అక్కడే ఉన్నారు.

పలు పార్టీల అధినేతలను కలుస్తారని ప్రచారం జరుగుతోంది. దేశ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్ ఇటీవల కాలంలో పార్టీల అధినేతలను కలిశారు. దేశ రాజకీయాల్లో తనతో కలిసిరావాలని మద్దతు తీసుకున్నారు. ఈ పర్యటనలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను కలుస్తారని తెలుస్తోంది. అందుకే కేసీఆర్ ఢిల్లీ బాట పట్టారని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు కేంద్రంలో ఉన్న పెద్దలను కూడా కలుస్తారని ప్రచారం జరుగుతోంది…
ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా తొలి రోజైన మంగ‌ళ‌వారం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత‌,ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్‌తో కేసీఆర్ భేటీ కానున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి వ్య‌తిరేకంగా ప‌లు పార్టీల‌తో కూట‌మి ఏర్పాటు చేసే దిశ‌గా క‌దులుతున్న కేసీఆర్‌.. అందులో భాగంగానే కేజ్రీవాల్‌ను క‌ల‌వ‌నున్న‌ట్లుగా స‌మాచారం. ఆ త‌ర్వాత మంగ‌ళ‌వార‌మే ఢిల్లీలోని ఎయిమ్స్‌కు వెళ్లి ఆరోగ్య ప‌రీక్ష‌లు చేయించుకోనున్న‌ట్లు తెలుస్తోంది..బుధ‌వారం, మూడో రోజైన గురువారం ప‌లువురు కేంద్ర మంత్రుల‌తో కేసీఆర్ స‌మావేశం కానున్న‌ట్లుగా స‌మాచారం. రాష్ట్ర విభ‌జ‌న హామీల అమ‌లు, స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, తెలంగాణ‌కు రావాల్సిన నిధులపై ఆయ‌న కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక ప‌లు రాష్ట్రాల‌కు చెందిన పార్టీల నేత‌లు ఎవరైనా ఢిల్లీలో అందుబాటులో ఉంటే వారితో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవ‌కాశాలున్న‌ట్లుగా టీఆర్ఎస్ వ‌ర్గాలు చెబుతున్నాయి..