కేజ్రీవాల్ హత్యకు కుట్ర అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మనీష్‌ సిసోడియా…

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి...

కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర: మనీష్‌ సిసోడియా

 సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడి కలకలం రేపింది. ది కశ్మీర్ ఫైల్స్ చిత్రంపై కేజ్రీవాల్ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు ఆయన ఇంటిపై దాడి చేశారు.  సీఎం కార్యాలయం ఫ్రంట్ గేట్‌ను ధ్వంసం చేశారు. సెక్యూరిటీ బారికేడ్లు దాటుకుని దూసుకెళ్లడంతోపాటు సీసీ కెమెరాలను ధ్వంసం చేసినట్టు ఆప్ వర్గాలు వెల్లడించాయి. అయితే సీఎం ఇంటిపై దాడి ఘటనపై ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్‌ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ఢిల్లీ పోలీసుల సాయంతో బీజేపీ గూండాలు రెచ్చిపోయారంటూ ట్వీట్‌ చేశారు. కేజ్రీవాల్ హత్యకు బీజేపీ కుట్ర చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.