ఆరోగ్య శాఖ మంత్రి ఇంట్లొ ఈడీ సోదాలు…భారీ ఎత్తున డబ్బు, గోల్డ్ కాయిన్స్పట్టుబడటం సంచలనంగా మారింది…

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది. గతనెల 30న మనీలాండరింగ్‌ కేసులో సత్యేంద్రను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం సోమవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన ఇంటిపై అధికారులు దాడులు నిర్వహించారు…ఆయన ఇంట్లో 2 కోట్ల 82లక్షల రూపాయల నగదు, 133 గోల్డ్ కాయిన్స్ ను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేబినెట్ లో కీలకమైన శాఖ నిర్వహిస్తున్న సత్యేంద్రనాథ్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయితే తమ ప్రభుత్వంపై కేంద్ర సర్కారు కక్ష కట్టిందని ఆప్ నేతలు, కేజ్రీవాల్ సైతం చెబుతూ వస్తున్నారు. తాజాగా జరిగిన ఈడీ రెయిడ్స్ లో భారీ ఎత్తున డబ్బు పట్టుబడటం సంచలనంగా మారింది…