ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడి నోటీసులు…!

ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణల నేపథ్యంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి ఈడి నోటీసులు..

గతంలో ఐదు సార్లు నోటీసులు జారీ చేసిన ఈడి..

ఐదు సార్లు ఈడి విచారణకు గైర్హాజరు కావడంతో ఆరోసారి నోటీసులు జారీ చేసిన ఈడి..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేటి విచారణకు గైర్హాజరు అయ్యారు. అయితే ఈనెల 21న మద్యం కుంభకోణం కేసులో విచారణకు హాజరుకావాలని సోమవారం నాడు కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి విచారణకు హాజరు కాకపోవడం వెనుక అనేక వార్తలు వినిపిస్తున్నప్పటికీ అసలు కారణం ఇదే అంటున్నారు ఆప్ నేతలు. ప్రస్తుతం ఆప్ అధినేత విపాసన ధ్యానం కోర్సులో చేరినట్లు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దా. ఈ కోర్సు నేటి నుంచి 10 రోజుల పాటూ ఉంటుందని చెప్పారు. డిశంబర్ 30తో విపాసన ధ్యానం కోర్సు ముగుస్తుందని చెప్పుకొచ్చారు..