ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు రేపు ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కల్వకుంట్ల కవితకు ఈడి నోటీసులు

రేపు ఈడీ కార్యాలయం ముందు హాజరుకావాలని నోటీసులు..

ఇటీవల కాలంలో లిక్కర్ స్కాం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సంచలనంగా మారింది… ప్రస్తుతం చంద్రబాబు నాయుడు అరెస్టు చేయటం మరో సంచలనం… ఇది ఎలా ఉంటే మళ్లీ ఢిల్లీ లిక్కర్ స్కాం తెరపైకి రావడంతో రకరకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి…
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు పంపారు. రేపు(శుక్రవారం) విచారణ కోసం ఢిల్లీకి రావాలని తెలిపారు. ఈ కేసు నిందితుల్లో ఒకరైన కవిత హైదరాబాద్ వ్యాపారి అరుణ్ పిళ్లై అప్రూవర్‌గా మారడంతో ఈడీ ఆమెకు తాజా నోటీసులు పంపింది. పిళ్లై ఈడీ అధికారులకు కీలక సమాచారం ఇవ్వడంతో కవితను మరోసారి విచారణకు పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ కేసులో ఈడీ అధికారులు కవితను ఇప్పటికే మూడుసార్లు విచారించారు. కొన్ని నెలలుగా కదలిక లేని ఈ కేసుపై ఈడీ మళ్లీ దృష్టి సారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. లిక్కర్ లైసెన్సు బాగోతంలో పిళ్లై కవిత బినామీగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ శ్రీనివాసుల రెడ్డి, ఆయన కొడుకు రాఘవరెడ్డి కూడా అప్రూవర్లుగా మారడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ‘లిక్కర్’ రాజకీయం వేడెక్కింది.