దిల్లీ మద్యం కేసు.. అప్రూవర్‌గా మారిన శరత్‌చంద్రారెడ్డి..

*దిల్లీ. దిల్లీ మద్యం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న పెనక శరత్‌చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారారు. ఆయన అప్రూవర్‌గా మారేందుకు దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు అంగీకరించింది..

వివిధ సంస్థలు, వ్యక్తులతో సిండికేట్‌ ఏర్పాటు చేసుకొని అవినీతి మార్గంలో సొమ్ము కూడగట్టుకొని ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారంటూ శరత్‌ చంద్రారెడ్డిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటు నగదు అక్రమ చలామణి వ్యతిరేక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం శరత్‌ చంద్రారెడ్డి బెయిల్‌పై ఉన్నారు..