రేపట్నుంచి దేశ రాజధాని ఢిల్లీలో బడిగంట..!

*రేపటి నుండి మోగనున్న బడిగంట*

రేపట్నుంచి దేశ రాజధాని ఢిల్లీలో పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి. విద్యార్ధులు ఫిజికల్‌ క్లాస్‌లకు హాజరుకాను న్నారు.

అక్కడి శీతల వాతావరణం దృష్ట్యా పాఠశాల సమయా ల్లో మార్పులు చేసినట్లు అధికారులు తెలిపారు. అన్ని విద్యాసంస్థల్లో ఉదయం 9 గంటలకు బడి గంటలు మోగనున్నాయి.

ఉదయం 9 గంటలకు ముందు ఏ పాఠశాల కూడా ప్రారంభంకాకూడదని అక్కడి ప్రభుత్వం ఉత్త ర్వుల్లో పేర్కొంది. ఉదయం వేళల్లో విద్యా ర్ధులను చలి నుంచి కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

అలాగే సాయంత్రం 5 గంటల తర్వాత ఏ పాఠశాల పనిచేయకూడదని స్పష్టం చేసింది. సూర్యాస్తమయం అయ్యే కొద్దీ ఉష్ణోగ్రతలు పడిపోతుంటాయని పేర్కొంది.

కాగా దేశ రాజధాని ఢిల్లీలో 3.5 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతలు నమోదయ్యా యి. నగరంలోని పలు ప్రాంతాల్లో దట్టమైన మంచు కనిపించింది.భారత వాతావరణ శాఖ అందించిన సమాచారం మేరకు..

ఢిల్లీలో ఈ రోజు కనిష్ట ఉష్ణోగ్రత సీజన్ సగటు కంటే నాలుగు పాయింట్లు తక్కువగా నమోదైనట్లు వెల్లడించింది. రానున్న మరో రెండు రోజుల్లో దట్టమైన పొగమంచు, చలిగాలులు ఉంటాయని అంచనా వేసింది.