ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం..!

Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం, అప్రూవర్‌గా మారిన వైసీపీ ఎంపీ.. ఏం జరుగుతోంది?

దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం నమోదైంది. వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి అప్రూవర్ గా మారారు. అనంతరం ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్ కు(ఈడీ) కేసుకు సంబంధించిన కీలక సమాచారం అందించారు. లిక్కర్ కేసులో సౌత్ గ్రూపు నుండి ఎక్కువ మంది అప్రూవర్స్ గా మారిన వైనం ఆసక్తి రేపుతోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి అప్రూవర్గా మారారు.

ఈడీకి కీలక సమాచారమిచ్చారు.

ఈ కేసులో శ్రీనివాసులు రెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి ఇప్పటికే అప్రూవర్ గా మారగా.. HYD నుంచి ఢిల్లీకి నగదు బదిలీపై ఈడీ ఫోకస్ పెట్టింది.

20 మంది కీలక వ్యక్తులను విచారించింది.

రాబోయే రోజుల్లో మరికొందరిని ఈడీ ప్రశ్నించే అవకాశముంది.

జీ-20 సదస్సు ముగిశాక దర్యాప్తు ముమ్మరం చేయనుంది..

కేసులో ముఖ్యంగా కొన్ని రోజులుగా హవాలా వ్యవహారాలు నడిపే 20 మందిని అధికారులు ప్రశ్నించారు. అందులో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కూతురు, బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ఆడిటర్ బుచ్చిబాబును ఈమధ్యనే మరోసారి ప్రశ్నించారు. ఇక రాబోయే రోజుల్లో ఇంకొంతమందిని ఈడీ (ED) అధికారులు ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది…