నవంబర్ 29 ‘దీక్షా దివాస్..

తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా ‘‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’’అన్న నినాదంతో 2009, నవంబర్ 29న టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు నేటికి 12 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… ‘‘కోట్లాది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు, ‘‘తెలంగాణ వచ్చుడో..కేసీఆర్ సచ్చుడో’’ అంటూ ప్రాణాలను పణంగా పెట్టి, సమైక్య పాలకుల నిర్బంధాలను చేధించి, సిద్దిపేట కేంద్రంగా ఉద్యమ వీరుడు కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించిన చారిత్రక రోజు… నవంబర్ 29 దీక్ష దివాస్’’ అంటూ కవిత ట్వీట్ చేశారు..