టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కొత్త సినిమా నిర్మాణ సంస్థ Dil Raju Dreams ను ప్రకటించారు.
ఈ బ్యానర్ యువ దర్శకులు, నటీనటులు, రచయితలు, టెక్నీషియన్లు, సంగీత దర్శకులకు ప్రోత్సహించనుంది.
కొత్త టాలెంట్, ఫ్రెష్ కంటెంట్ దీని లక్ష్యం.
త్వరలో లాంచ్ కానున్న వెబ్సైట్ ద్వారా ఆసక్తిగల వారు తమ ఐడియాలు, ప్రొఫైల్స్‌ను పంపవచ్చు.
ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి….కొన్ని కొన్ని సినిమాలు ఎందుకు తీస్తారో కూడా తెలియదు. అలంటి సినిమాల ద్వారా డబ్బు వృథాగా పోతోందో నాకు తెలుస్తుంది. అందుకే ఈ డ్యామేజ్‌ను కంట్రోల్ చేయాలని, సరైన ఫ్లాట్ ఫాం ఉండాలని దిల్ రాజు డ్రీమ్స్‌ను స్థాపించాను. ఏడాదికి నాలుగైదు సినిమాలనే చేయాలని ఫిక్స్ అయ్యాం. కచ్చితంగా రెండు అయినా హిట్ కావాలనే కండీషన్ పెట్టాను. బలగం వేణు మాకు సినిమా చేశాడు. మాతో ఎమోషన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ ఎల్లమ్మ సినిమాను కూడా మాకే చేస్తున్నారు. అలా కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే నాక్కూడా హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఎలాంటి రికమండేషన్స్ ఉండవు. అందరూ వెబ్ సైట్స్ ద్వారానే అప్రోచ్ అవ్వాలి. 20 నిమిషాల స్క్రిప్ట్‌ను అందులో పెట్టాల్సి ఉంటుంది. అది మా టీం చూస్తుంది. ఆ తరువాత వడపోత కార్యక్రమం తరువాత నా వద్దకు వస్తుంది. ఈ కొత్త కథలను వినేందుకు వారంలో ఒక రోజు ఇకపై తప్పకుండా కేటాయిస్తాను..