ఢిల్లీలో మోడీ అత్యవసర సమావేశం.

*

*న్యూఢిల్లీ
అమెరికా, ఈజిప్టులో ఆరు రోజుల అధికారిక పర్యటన ముగించుకుని భారత్‌కు తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మంత్రివర్గ సహచరులతో సోమవారంనాడు సమావేశమయ్యారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితిని, ముఖ్యంగా మణిపూర్ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, నిర్మలా సీతారామన్, హర్దీప్ సింగ్ పురి, సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీనికి ముందు అమిత్‌షా నేరుగా ప్రధానితో భేటీ అయ్యారు. మణిపూర్‌లో ప్రస్తుత పరిస్థితిని ప్రధానికి ఆయన వివరించినట్టు సమాచారం. మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్.బీరేన్ సింగ్ ఆదివారంనాడు ఢిల్లీలో అమిత్‌షాను కలుకున్న నేపథ్యంలో మోదీతో అమిత్‌షా భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.

ప్రధానమంత్రి ఇండియాకు తిరిగి రాగానే దేశంలో ఏమి జరుగుతోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర నాయకులను సైతం అడిగినట్టు తెలుస్తోంది. దీనిపై మీడియా అడిగిన ప్రశ్నకు బీజపీ ఎంపీ మనోజ్ తివారీ సమాధానమిస్తూ, అంతా సజావుగానే సాగుతోందా అని నడ్డాను మోదీ ప్రశ్నించారని, ప్రభుత్వం తొమ్మిదేళ్లలో సాధించిన విజయాలను ప్రజల ముందుకు తీసుకువెళ్తున్నామని, అంతా సంతోషంగా ఉన్నారని నడ్డా సమాధానమిచ్చారని తెలిపారు…..