స్కూల్‌కు వెళ్తున్న బాలికపై యువకుడి పైశాచికం! CCTVలో రికార్డ్‌

ఆడపిల్ల ఒంటరిగా కనిపిస్తే చాలు కొంతమంది మగాళ్లలో పైశాచికత్వం తన్నుకొస్తుంది. చుట్టుపక్కల ఎవరూ లేరంటే చాలు ఆడదాన్ని సుఖమిచ్చే బొమ్మగా చూస్తూ.. జన్మనిచ్చిన అమ్మ అనే సంగతే మర్చిపోతున్నారు. తాజాగా జరిగిన ఓ సంఘటన చూస్తే ఆడ పిల్లలను స్కూల్‌కి ఒంటరిగా పంపే తల్లిదండ్రులు వణికిపోవాల్సిందే. ఉదయాన్నే లేచి, చక్కగా రెడీ అయి.. స్కూల్‌కి వెళ్తున్న ఓ చిన్నారిపై ఓ కామాంధులు చిత్తకార్తి కుక్కల విరుచుకుపడ్డాడు. ఆ బాలిక వెళ్తున్న వీధిలో ఎవరూ లేకపోవడంతో, ఇదే అదునుగా భావించి తన కామవాంఛను తీర్చుకున్నాడు. ఈ దారుణమంతా అక్కడే ఓ భవనానికి ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయింది..ఈ ఘటన బంగ్లాదేశ్‌లోని దినాజ్‌పూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వైల్డ్‌గా రియాక్ట్‌ అవుతున్నారు. ఇలాంటి వాళ్లును ఊరికే వదలకూడదని, వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని, అప్పుడే ఇలాంటి ఆలోచనలు చేసే వారికి భయం పుడుతుందని అంటున్నారు. ఘటన ఎక్కడ జరిగినా.. జరిగింది అభం శుభం తెలియని ఒక బాలికపైనే అంటూ నెటిజన్లు అంటున్నారు..సీసీటీవీ కెమెరాలో రికార్డ్‌ అయిన దృశ్యాలు చూసినట్లు అయితే.. ఓ బాలిక వైట్‌ అండ్‌ వైట్‌ స్కూల్‌ యూనిఫామ్‌ ధరించి పాఠశాలకు వెళ్తోంది. అయితే.. ఆ వీధిలో జనాలు ఎవరూ లేరు. ఇది గమనించిన ఓ యువకుడు.. ఆ బాలికను ఫాలో అవుతూ వెనకాలే వచ్చాడు. అతను వెంబడిస్తున్నాడని గ్రహించిన ఆ బాలిక భయంతో ఒక పక్కకు నిల్చుంది. వెంటనే ఆమెపైకి దూసుకెళ్లిన ఆ యువకుడు బలవంతంగా బాలికకు ముద్దుపెట్టి.. అసభ్యంగా ప్రవర్తించాడు. దాంతో ఆ బాలిక భయభ్రంతులకు గురైంది. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. ఇదంతా.. సీసీటీవీలో రికార్డ్‌ అయింది.