దీపావ‌ళి నాడు ఆ గ్రామంలో ఒక‌రినొక‌రు క‌ర్ర‌ల‌తో కొట్టుకుంటారు..

ఆచార వ్య‌వ‌హారాల్లో కొద్దిపాటి మార్పులు క‌నిపిస్తాయి. అదేవిధంగా దీపావళి రోజు కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఆచారం ఉంటుంది. దీపావళిని కొందరు బందీఛోడ్‌ దివస్‌గా నిర్వహించుకుంటే, మరోచోట లాత్‌మార్‌ దీపావళిగా జరుపుకుంటారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బుందేల్‌ఖండ్‌లోని జలౌన్‌ గ్రామస్తులు కూడా ప్రతి ఏడాది లాత్‌మార్‌ దీపావళిని వేడుకగా జరుపుకుంటారు…దీపావ‌ళి నాడు ఆ గ్రామంలో ఒక‌రినొక‌రు క‌ర్ర‌ల‌తో కొట్టుకుంటారు. ఇవాళ కూడా జ‌లౌన్ గ్రామానికి చెందిన ప్ర‌జ‌లు ఎప్ప‌టిలాగే లాత్‌మార్ దీపావ‌ళి చేసుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇంతకూ ఆ వీడియోలో ఏముందంటే ముందుగా గ్రామ‌స్తులంతా ఒక‌చోట చేరారు. ఆ తర్వాత రెండు గ్రూపులుగా విడిపోయి నృత్యాలు చేశారు. ఆపై ఒక గ్రూప్‌పై మ‌రో గ్రూప్ క‌ర్ర‌ల‌తో దాడి చేసుకున్నారు…లాత్‌మార్‌ దీపావళి తాము అనాదిగా ఆచరిస్తున్నామని జలౌన్‌ గ్రామస్తులు తెలిపారు. అయితే, ఈ ఉత్స‌వాల్లో పాల్గొనే వారంతా 30 నుంచి 40 ఏండ్ల మ‌ధ్య వయస్కులే ఉంటారు. ఇవాళ జ‌లౌన్‌లో జ‌రిగిన లాత్‌మార్ దీపావ‌ళికి సంబంధించిన దృశ్యాల‌ను సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతుంది…