డిప్యూటీ సీఎంతో సబ్ కమిటీ భేటీ…

తెలంగాణ సచివాల యంలోని డిప్యూటి సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ లో కేబినెట్ సబ్ కమిటీ ఈరోజు సమావేశమైంది.

ఈ సమావేశంలో మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, అధికారులు పాల్గొన్నారు. ఈ భేటీలో ఆరు గ్యారెంటీల అమలు, మార్గదర్శకాలపై చర్చిస్తు న్నారు.

అంతేకాకుండా.. ఈ నెల చివరి నాటికి అభయ హస్తం దరఖాస్తులు ఆన్లైన్లో ఎంట్రీ పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు.

అనంతరం ఎంత మంది లబ్దిదారులన్న దానిపై క్లారిటీ రానుంది. ఈనెల చివరిన లేదా వచ్చే నెలలో గ్యారెంటీ అమలుపై తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది…