జితేందర్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్నా.. ఇప్పుడు పార్లమెంట్ సీటు నాదే’. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ సీటు వదులుకున్న.డీకే అరుణ …

‘జితేందర్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటు వదులుకున్నా.. ఇప్పుడు పార్లమెంట్ సీటు నాదే’. జితేందర్ రెడ్డి కోసం అసెంబ్లీ సీటు వదిలేశానని జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేర్కొంటున్నారు… మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థిని తానే అని.. రెండో జాబితాలో తనపేరే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు భారీ షాక్ తప్పదని అన్నారు. పదేళ్ల తర్వాత బీఆర్ఎస్‌కు ప్రజలు సరైన విధంగా బుద్ధి చెప్పారని.. ఇప్పుడు రెండు నెలల కాంగ్రెస్‌ పాలన చూసిన ప్రజలు ఆ పార్టీకి బుద్ధి చెబుతారని అన్నారు. రాష్ట్రంలో తాము మెజార్టీ సీట్లు గెలుచుకుంటామని తెలిపారు. కేంద్రంలోనూ మూడోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయమన్నారు.