మూడేళ్ల క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కుంగి పోయింది…కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 60 ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది..కర్ణాటక డిప్యూటీ సీఎం Dk శివకుమార్,.

సూర్యాపేట జిల్లా..

హుజూర్ నగర్ నియోజకవర్గం

హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలో కర్ణాటక డిప్యూటీ సీఎం Dk శివకుమార్, AP Pcc అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, Mp ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డు షో, కార్నర్ మీటింగ్… భారీగా తరలి వచ్చిన కార్యకర్తలు…

Dk శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం ఖాయం..

మిత్రుడు ఉత్తమ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా…

ఉత్తమ్ నియోజకవర్గానికి మాత్రమే కాదు రాష్ట్రంలో కూడా బలమైన వ్యక్తి

ఎప్పుడైతే కాంగ్రెస్ అధికారంలో ఉంటుందో, సమాజంలో అన్ని వర్గాలు కూడా అధికారంలో ఉన్నట్లే…

ఈ నియోజకవర్గం సిమెంట్ పరిశ్రమలకు పుట్టినిల్లు..సిమెంట్ ఏ విధంగా ఇంటిని పటిష్టం చేస్తుందో..

కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుంది…

ఈ నియోజికవర్గం రైతులు అదృష్టవంతులు..

కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ తో పంటలు మంచి పంటలు పండిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ నిర్మించిన నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ 60 ఏళ్ల క్రితం నిర్మించినా ఇప్పటికీ చాలా పటిష్టంగా ఉంది..

మూడేళ్ల క్రితం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ అప్పుడే కుంగి పోయింది..

పదేళ్ల పాటు కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్రటేరియట్ లో అడుగు పెట్టలేదు…

ఇప్పుడు పర్మినెంట్ గా విశ్రాంతినిద్దాం..

బీజేపీ , తెరాస ది చీకటి ఒప్పందం..

తెలంగాణ కి గాంధీ కుటుంబానికి అత్యంత అవినాభావ సంబంధం ఉంది…

తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ రుణం తీర్చుకొనే సమయం వచ్చింది..

కర్ణాటకలో కాంగ్రెస్ ఏవిధంగా అధికారంలోకి వచ్చిందో…
తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుంది..

హుజూర్ నగర్ నియోజకవర్గం ఉత్తమ్ కుమార్ రెడ్డి హాయంలోనే అభివృద్ధి జరిగింది..

కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీ స్కీమ్స్ తెలంగాణ చరిత్రలో నిలబడుతుంది…

మేం కర్ణాటకలో ఇచ్చిన 5 గ్యారెంటీ పథకాలను ఇప్పటికే అమలు చేశాం…

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీ మహిళకు 2వేల రూపాయిలు ఇస్తాం..
గ్యాస్ సిలిండర్ 400 కు ఇస్తాం..
ఇందిరమ్మ రైతు భరోసా కింద ప్రతీ రైతుకి 15000 రూపాయిల ఇస్తాం..

భూమి లేని రైతు కూలీలకు 12000 రూపాయిలు ఇస్తాం..

వరి పండించే రైతులకి msp కి అదనంగా 500 రూపాయిలుకు కొంటాం…

ఇల్లు లేని ప్రతీ పేదవారికి 100గజాల స్థలం 5లక్షల రూపాయలను ఇస్తాం..

కెసిఆర్, కేటీఆర్ ఎమ్మెల్యేలను కర్ణాటకకు ఆహ్వానిస్తున్నాం..మీరే వచ్చి చూడండి కాంగ్రెస్ ప్రకటించిన.5స్కీమ్స్ ను.ఇప్పటికే అమలు చేస్తున్నాం..

కెసిఆర్ దళితులను సీఎం చేస్తా అన్న హామీని మరిచిండు.
దళితులకు, గిరిజనులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి…

కెసిఆర్ హామీ ఇచ్చిన మైనారిటీలకు, గిరిజనులకు ఇచ్చిన రిజర్వేషన్లు ఏమయ్యాయి…

కెసిఆర్ ఇంటికొక.ఉద్యోగం ఇస్తా అన్న హామీని మరిచిందు..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం..

బీజేపీ, BRS మధ్య చీకటి ఒప్పందం ఉంది..Brs కు ఓటేస్తే బీజేపీ కి ఓటేసినట్లే…

నాకొచ్చిన లక్షా 20వేల మెజారిటీ ఉత్తమ్ కు కూడా రావాలి..