వికారాబాద్ జిల్లా..
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని.. డిసెంబర్ 9వ తేదీన తమ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలపై సంతకం చేయబోతుందని కాంగ్రెస్ కీలక నేత, కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. విజయ భేరి బస్సు యాత్రలో భాగంగా శనివారం వికారాబాద్ జిల్లా తాండూర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో డీకే మాట్లాడుతూ..
డిసెంబర్ తర్వాత సీఎం కేసీఆర్‌కు మొత్తం రెస్టేనని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుండటంతో ఫామ్ హౌస్‌లోనే పూర్తిగా ఆయన విశ్రాంతి తీసుకుంటారని ఎద్దేవా చేశారు.కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన నెలల్లోనే నెరవేర్చాం..మరీ 9 ఏండ్ల క్రితం కేసీఆర్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు.
కాగా, కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ స్కీమ్‌లు తెలంగాణ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఐదు గ్యారంటీలు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక స్కీమ్‌లను అమలు చేయడం లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.
బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వంటి నేతలు సైతం ఈ అంశాన్నే హైలెట్ చేస్తూ కాంగ్రెస్‌ను టార్గెట్ చేస్తున్నారు.రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ విమర్శలకు కాంగ్రెస్ సైతం అదే రీతిలో కౌంటర్ ఇస్తోంది.
కెసిఆర్ కేటీఆర్ మేము ప్రకటించిన పథకాలను ఏ విధంగా అమలు చేస్తున్నామో కర్ణాటకకు వచ్చి చూడాలన్నారు. మీరు వస్తానంటే నేను బస్సు కూడా ఏర్పాటు చేస్తానని డీకే శివకుమార్ ఎద్దేవా చేశారు
కర్నాటకలో కాంగ్రెస్ ఇచ్చిన ఐదు గ్యారంటీ స్కీమ్స్ ప్రతి గడపకు అందుతున్నాయని.. దమ్ముంటే బీఆర్ఎస్ నేతలు కర్నాటక వెళ్లి చూసి రావొచ్చని డీకే శివకుమార్ సవాల్ విసిరారు..
దీంతో తెలంగాణ ఎన్నికల సమరంలో కర్నాటక ఆరు గ్యారంటీలు హాట్ టాపిక్‌గా మారాయి. తెలంగాణ కాంగ్రెస్ సైతం ఐదు గ్యారంటీలు ప్రకటించిన సంగతి తెలిసిందే…