ఓ వైద్యుడు ఆపరేషన్‌ థియేటర్‌ గదినే ప్రీ వెడ్డింగ్ షూట్…!!

పెళ్లికి ముందు ఫ్రీ వెడ్డింగ్ పేరిట జరుగుతున్న రకరకాల ఫోటోషూట్లను చూస్తుంటే కొందరికి ఆసక్తి అనిపించినా మరి కొందరికి మాత్రం ఇది మరో రకం పిచ్చి అని భావిస్తున్నారు.. ప్రీ వెడ్డింగ్‌ షూటింగ్ పేరిట కొత్త ట్రెండ్‌ మొదలైన విషయం తెలిసిందే. తమ ప్రీ వెడ్డింగ్ షూట్ డిఫరెంట్ గా ఉండాలని చాలా మంది జంటలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.తాజాగా ఓ డాక్టర్ తన ప్రీ వెడ్డింగ్ షూట్ ను ఏకంగా ఆపరేషన్ థియేటర్ లోనే ఏర్పాటు చేశాడు. ఈ సంఘటన కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లాలోని ఆసుపత్రిలో జరిగింది.

భరంసాగర్‌ ఏరియాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒప్పంద వైద్యుడిగా పనిచేస్తున్న ఓ వైద్యుడు ఆపరేషన్‌ థియేటర్‌ గదినే ప్రీ వెడ్డింగ్ షూట్ కు వేదికగా ఉపయోగించుకున్నాడు. తన భాగస్వామితో కలిసి ఓ రోగికి శస్త్రచికిత్స చేస్తున్నట్లుగా ఫొటోలు, వీడియోలు తీయించుకున్నాడు. ఇది వైద్యవర్గాల్లో చర్చనీయాంశమై ప్రభుత్వం దృష్టికి రావడంతో కర్ణాటక వైద్యారోగ్యశాఖ మంత్రి దినేశ్‌ గుండు రావ్‌ ఆసుపత్రిలో ప్రీవెడ్డింగ్‌ షూట్‌ నిర్వహించిన సదరు వైద్యుడిని తక్షణమే సర్వీస్‌ నుంచి డిస్మిస్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫొటోషూట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది