కుక్క నోట్లో శిశువు తల, ఊహించని ఘటనతో స్థానికులు షాక్‌ …

రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఎల్బీ నగర్‌లో ఓ బాలుడి తల కలకలం సృష్టించింది… వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్ 1 దగ్గర ఓ శిశువు తల కుక్క నోట్లో పట్టుకుని తీసుకొచ్చింది. ఊహించని ఘటనతో స్థానికులు షాక్‌ తిన్నారు. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో శిశువు తలను పట్టుకొచ్చింది కుక్క.. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని కుక్కని తరిమేసి వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.. ఇక, వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. డాగ్‌ స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు.. బాలుడి తల కుక్క ఎక్కడి నుండి తెచ్చింది అని దర్యాప్తు చేపట్టారు.. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు వనస్థలిపురం పోలీసులు. ఆ బాలుడికి దాదాపు పదేళ్ల వయస్సు ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు… అసలు ఆ బాలుడు ఎవరు? బాలుడిని ఎవరైనా హత్య చేశారా? ఆ కుక్కకు బాలుడి తల ఎక్కడ దొరికింది? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది.