కుక్క మూత్రపిండంలో సుమారు 40 రాళ్లు..!! చూసి షాక్ అయినా డాక్టర్లు..
గ్రేట్ డేన్ కుక్కకు అరుదైన శస్త్ర చికిత్స..
గ్రేట్ డేన్ కుక్కకు అరుదైన శస్త్ర చికిత్స
సూర్యాపేట జిల్లా..
మనిషి కిడ్నీలో రాళ్లు ఉండటం ఇవన్నీ మనం అరుదు గానే వింటున్నాం చూస్తూనే ఉన్నా కానీ ఇక్కడ జరిగిన ఘటన అలాంటిది కాదు.. మూగజీవాల పట్ల ప్రేమ ఉన్న కొందరు వారింట్లో ఉన్న కుక్కను కూడా అత్యంత ఆప్యాయంగా ఒక ఇంటి మనిషిలా చూసుకోవడం ఎక్కడైనా జరుగుతూనే ఉంటుంది అలాంటి జంతు ప్రేమికుడే తన పెంచుకుంటున్న కుక్కకి అరుదైన శాస్త్ర చికిత్సను చేయించారు ఈ ఘటన..హుజూర్నగర్ పట్టణానికి చెందిన మధు తన పెంపుడు కుక్క గ్రేట్ డేన్ మగ కుక్క వయసు రెండు సంవత్సరాలు. వారం రోజులుగా మూత్ర విసర్జన సమస్యతో బాధపడుతున్నది. ఈరోజు ప్రాంతీయ పశు వైద్యశాల హుజూర్నగర్ శస్త్ర చికిత్స చేసి మూత్రసంచి తోపాటు జననాంగం నుంచి రాళ్లు తీయడం జరిగింది…. ఈ చికిత్సలు చూసి జంతు ప్రేమికుడు వైద్యుల పట్ల హర్ష వ్యక్తం చేసి అభినందనలు తెలిపారు..