కుక్క కరిస్తే ఏం చేయాలి.. అందరూ తప్పక తెలుసుకోవాల్సిన విషయం..

కుక్క కరచిన తక్షణమే తీసుకోవలసిన చర్యలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం తక్షణమే వైద్య సహాయం పొందండి –
కుక్క కాటు గురైనవారికి వెంటనే, కరచిన చోట నీటితో లేదా రుద్ది శుభ్రపరచాలి. ఒకటి లేదా రెండు చుక్కల హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణంతో కూడా శుభ్రపరచవచ్చు. లోతైన గాయలైతే కనుక వెంటనే వైద్యుని వద్దకు వెళ్ళాలి, ఎందుకంటే లోతైన గాయాలకు చికిత్స అందించకుంటే, వివిధ ఇతర వ్యాధులను కూడా వ్యాపింపజేస్తాయి. ఇది చాలా ముఖ్యంగా ఆచరించవలసిన నియమం…. ప్రథమ చికిత్స లో భాగంగా గాయమైన ప్రాంతాన్ని పైనుంచి పడే నీటి ప్రవాహం కింద శుభ్రం చేయాలట. అంటే మగ్గుతో పై నుండి నీళ్లు పోస్తు గాని లేదా కొళాయి కిందకాని శుభ్రం చేయాలట. ఇక కుక్క కరిచిన తర్వాత రేబిస్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే డాక్టర్ను సంప్రదించి యాంటీ రేబిస్ ఇంజెక్షన్లు తీసుకోవాలట. ఇక ఇంజక్షన్లను మోతాదుని బట్టి మూడు లేదా ఐదు సార్లు తీసుకోవడం వల్ల రేబీస్ బారిన పడకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందట…వ్యాక్సిన్ వేయించుకోండి- మీకు కరచిన కుక్క ఆరోగ్యమైనదే అని మీకు మీరే నిర్ధారించుకోరాదు. ఇటువంటి పరిస్థితి భవిష్యత్లో మళ్లీ ఎదురవ్వదని భావించరాదు. కుక్క కరచిన వెనువెంటనే తగిన వైద్య సహాయం పొంది, టీకాలు వేయించుకోవాలి లేని సందర్భంలో రేబిస్ వంటి ప్రమాదకరమైన జబ్బులు సోకే అవకాశం ఉంది. చేయకూడని పనులు: చేయవలసిన పనుల వలె చేయకూడని పనులను గురించి కూడా తెలుసుకోవడం తప్పనిసరి. విస్మరించకండి – ఎప్పుడు మరచిపోకూడని విషయం ఏమిటంటే, కుక్కలు కలుగజేసిన గాయాలను తేలికగా తీసుకోకండి. ఈ గాయాలు చాలా ప్రమాదకరమైనవి. వెంటనే తగిన వైద్య సహాయం తీసుకుని, ప్రధమ చికిత్స పొంది, దానికి సంబంధించిన వివరాలను భవిష్యత్ అవసరాల కొరకు జాగ్రత్త పరచాలి.