భారత్ పరువు తీసిన ఓ డాక్టర్…

భారత్ పరువు తీసిన ఓ డాక్టర్.. .కృష్ణ సింగ్.స్కాట్ ల్యాండ్ లో ఉంటున్న భారత సంతతికి చెందిన డాక్టర్.కృష్ణా, రామ అనో లేక మనుమలు, మనుమరాళ్ళతో ఆడుకోవాల్సిన వ్యక్తి తన వద్దకు వచ్చే మహిళా రోగులతో ఆడుకోవడం మొదలు పెట్టాడు.వారిని లైంఘికంగా వేధిస్తూ ఇబ్బందులు పెట్టేవాడు…మహిళా రోగులకు ముద్దులు ఇస్తూ తాక కూడని ప్రదేశాలలో తాకుతూ అసభ్యంగా మాట్లాడుతూ వేధింపులకు గురిచేసేవాడు.ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే 1983 నుంచీ కృష్ణ సింగ్ వ్యవహార శైలి ఇలానే ఉండేదట.1983 – 2018 మధ్య కాలంలో ఎంతో మంది మహిళ రోగులతో అసభ్యంగా ప్రవర్తించేవాడని పోలీసుల విచారణలో తేలిందట.
ఈ క్రమంలో 2018 ఓ మహిళ ధైర్యం చేసి బయటకు వచ్చి అతడిపై ఫిర్యాదు చేయడంతో అయ్యగారి భాగోతం మొత్తం బయటపడింది.
దాంతో అతడిని అరెస్ట్ చేసిన స్కాట్ ల్యాండ్ పోలీసులు అతడిపై వచ్చిన సుమారు 50 కి పైగా ఫిర్యాదులను పరిశీలించి అరెస్ట్ చేశారు. కాగా ఈ వైద్యం ఓ ప్రత్యేకమైనదని, దీనిని తాను భారత్ లో నేర్చుకున్నానని నేను ఎలాంటి తప్పు చేయలేదంటూ చెప్పినా ఫలితం లేకపోయింది…

భారత చదువుల్లో అలాగే చెప్పారంటూ చెప్పిన వైనం.

2018లో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కృష్ణా సింగ్ (72) అనే వ్యక్తిని స్కాట్లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు…ఆ శాఖ డిటెక్టివ్స్ కేసును దర్యాప్తు చేశారు. అనంతరం అతడిని గ్లాస్గో హైకోర్టులో ప్రవేశపెట్టారు…

కోర్టు అతడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది.

అయితే, అతడు మాత్రం తాను చేసిన తప్పు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు.
నెపాన్ని భారత విద్యావ్యవస్థ మీదకు నెట్టే ప్రయత్నం చేశాడు…మహిళలు ఆరోపిస్తున్నదంతా అబద్ధం. కొన్ని పరీక్షలు మాకు భారత వైద్య శిక్షణలో భాగం…అదే మేం చదువుకున్నప్పుడు చెప్పారు’’ అని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించాడు.