7 నిమిషాల తర్వాత అద్భుతం….తన ఊపిరినే బిడ్డకు శ్వాసగా మార్చిన వైద్యురాలు..!!

7 నిమిషాల తర్వాత అద్భుతమే జరిగింది..

డాక్టర్ దేవుడితో సమానం అంటారు. ఈ మాటను నిజం చేసింది ఓ వైద్యురాలు. తన ఊపిరినే బిడ్డ ఊపిరిగా మార్చి పసి పాప ప్రాణ దీపాన్ని వెలిగించింది. ఇందుకు సబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ పిల్లల వైద్యురాలు అప్పుడే పుట్టిన బిడ్డకు తన నోటితో శ్వాసను అందిస్తోంది. ఇలా శ్వాస అందించడం వల్ల ఆ పాప బతికింది._*

*_ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రాలోని CHCకి ఓ మహిళ ప్రసవానికి వచ్చింది. ఆమె పండంటి ఆడ పిల్లకు జన్మనిచ్చింది. కానీ ఆ బిడ్డలో చలనం లేదు. దీంతో పాపకు ఆక్సిజన్ సపోర్ట్ చేసినా ఫలితం లంభించలేదు. అందరు ఆశాలు వదులుకున్నారు. కానీ అక్కడున్న పీడియాట్రిషియన్ డాక్టర్ సులేఖా చౌదరి తన ప్రయత్నాన్ని ఆపలేదు. బిడ్డ బతికించాలన్న కృతనిశ్చయంతో దాదాపు 7 నిమిషాల పాటు ‘మౌత్‌ టూ మౌత్‌ రెస్పిరేషన్‌’ అందించడంతో చిన్నారి ఊపిరి పీల్చుకుంది. శిశువు బతకడంతో అక్కడున్న వారంతా ఆనందం వ్యక్తం చేశారు. పీడియాట్రిషియన్ డాక్టర్ సులేఖా చౌదరి కృతజ్ఞతలు తెలిపారు. మీరు దేవత అంటూ కిర్తీంచారు. సచిన కౌశిక్ అనే పోలీసు అధికారి ట్వట్టర్ ఓ ఈ ఘటనకు సంబంధించిన వీడియో పోస్ట్ చేశారు. పోస్ట్ తో పాటు ‘డాక్టర్ సులేఖా చౌదరి, పీడియాట్రిషియన్, CHC, ఆగ్రా. ఆడపిల్ల పుట్టింది కానీ శరీరంలో చలనం లేదు. ముందుగా బాలికకు ఆక్సిజన్‌​​సపోర్టు అందించినా ఫలితం లేకపోవటంతో దాదాపు 7 నిమిషాల పాటు ‘మౌత్‌ టూ మౌత్‌ రెస్పిరేషన్‌’ అందించడంతో చిన్నారి ఊపిరి పీల్చుకుంది’ అని రాసుకొచ్చారు. ఈ వీడియోను బుధవారం రాత్రి పోస్టు చేయగా ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది రీట్వీట్లు చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. డాక్టర్ సులేఖా చౌదరికి ఫ్యాన్స్ అయిపోయారు. తన ఊపిరిని బిడ్డ ఊపిరిగా మార్చిన సులేఖ గ్రేట్ అంటూ కామెంట్.. ఈమెనే నిజమైన వైద్యురాలంటూ ప్రశంసించారు.