హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టివేత..!!

తెలంగణ రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి వంటి మాదక ద్రవ్యాల కట్టడికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టింది. డ్రగ్స్ సరఫరా, వినియోగంపై రాష్ట్ర పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు..

ఎక్కడికక్కడ సరఫరాను నియంత్రిస్తున్నారు. అయినా రోజూ ఏదో చోట డ్రగ్స్, గంజాయి పట్టుబడుతూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్​లో భారీగా డ్రగ్స్, గంజాయి పట్టుబడ్డాయి.
ముంబయికి చెందిన నలుగురు డ్రగ్ స్మగ్లర్లను హైదరాబాద్ నార్కోటిక్ విభాగం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠా సభ్యుల నుంచి 204 గ్రాముల ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్ స్మగ్లర్లపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నగరంలోని పలువురు ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేసేందుకు ఈ ముఠా ముంబయి నుంచి వచ్చినట్లు తెలుస్తోంది..మరోవైపు ఇవాళ నగరంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులను ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రెస్టు చేశారు. ఆ ముఠా నుంచి 110 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని తరలిస్తున్న కారును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.