డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్ …

హైదరాబాద్

డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్

లక్ష్మీపతిని అరెస్ట్ చేసిన నార్కోటిక్ వింగ్ బీటెక్ విద్యార్థి మృతి కేసులో లక్ష్మీపతి నిందితుడు పలువురికి హోష్ ఆయిల్ ను సప్లై చేస్తోన్న లక్ష్మీపతి
ఏడేళ్లుగా గంజాయికి బానిస అయిన లక్ష్మీపతి విద్యార్థిగా ఉన్నప్పుడే గంజాయి, డ్రగ్స్ అమ్మిన లక్ష్మీపతి ఏజెన్సీ నుంచి హోష్ ఆయిల్ తెచ్చి హైదరాబాద్ లో అమ్మిన లక్ష్మీపతి రూ.లక్షకు లీటర్ హోష్ ఆయిల్ ను కొని రూ.8 లక్షలకు అమ్మకం ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి కలిసి డగ్స్ అమ్మకాలు
గోవా నుంచి డ్రగ్స్ తెచ్చి విద్యార్థులకు విక్రయిస్తున్న లక్ష్మీపతి…..

ఇదిలా ఉంటె.. గత కొద్దీ రోజులుగా డ్రగ్స్ కేసులో కీలక సూత్రధారి అయినా లక్ష్మీపతి..ఎట్టకేలకు పోలీసులకు దొరికాడు. ఆంధ్ర లో లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుంది హెచ్ న్యూ వింగ్. హైదరాబాద్ డ్రగ్ కేసులో లక్ష్మీపతి కోసం ఐదు రోజులుగా గాలించిన పోలీసులకు… ఈరోజు ఏపీలో అదుపులోకి తీసుకున్నారు. బీటెక్ విద్యార్థి మృతిలో కీలక సూత్రధారిగా లక్ష్మీపతి ఉన్నాడు.

బీటెక్ స్టూడెంట్‌గా ఉన్నప్పుడే గంజాయికి అలవాటు పడ్డ లక్ష్మీపతి …ఏడేళ్లుగా గంజాయికి బానిసై గంజాయి , డ్రగ్స్ తీసుకుంటూ , అమ్ముతూ వస్తున్నాడు. ఏజెన్సీ ప్రాంతం నుంచి ఆశిష్ ఆయిల్ తెచ్చి అమ్మడం మొదలు పెట్టాడు. రూ.లక్షకు లీటర్ ఆశిష్ ఆయిల్ కొనుగోలు చేసిన లక్ష్మీపతి.. హైదరాబాద్‌లో లీటర్ ఆశిష్ ఆయిల్‌ని రూ. 8లక్షలకు అమ్మడం మొదలు పెట్టాడు. ప్రేమ్‌ కుమార్, లక్ష్మీపతి కలిసి డ్రగ్స్ అమ్మకాలు కొనసాగించాడు. ఈ క్రమంలో రీసెంట్ గా బిటెక్ విద్యార్థి డ్రగ్స్ కు అలవాటు పడి చివరకు ప్రాణాలు వదిలాడు