హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ వ్యవ‌హారంపై లుకౌట్ నోటీసులు జారీ .

హైద‌రాబాద్‌లో క‌ల‌క‌లం రేపిన ఫుడింగ్ అండ్ మింక్ ప‌బ్ వ్యవ‌హారంపై తెలంగాణ పోలీసులు శుక్ర‌వారం కీల‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ కేసులో కీల‌క వ్య‌క్తులుగా ప‌రిగ‌ణిస్తున్న కిర‌ణ్ రాజ్‌, అర్జున్ వీర‌మాచనేనిల‌పై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ప్ర‌స్తుతం ప‌రారీలో ఉన్న వీరిద్ద‌రూ విదేశాల‌కు పారిపోయే అవ‌కాశాలున్నాయ‌న్న భావ‌న‌తో పోలీసులు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ..ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి మ‌రిన్ని వివ‌రాలు సేక‌రించిన పోలీసులు… ప‌బ్ ఆదాయం చూసి షాక్ తిన్నార‌ట‌. నెల‌కు హీన‌ప‌క్షం రూ.3.5 కోట్ల మేర ఆదాయాన్ని రాబ‌డుతున్న ఈ ప‌బ్‌.. వారాంతాల్లో ఏకంగా రూ.30 నుంచి 40 ల‌క్ష‌ల మేర ఆదాయాన్ని ఆర్జిస్తోంద‌ట‌. అంతేకాకుండా రోజుకు రూ.10 ల‌క్ష‌ల‌కు త‌క్కువ కాకుండా ఆదాయాన్ని ఈ ప‌బ్ రాబ‌డుతోంద‌ట‌….