డ్రగ్స్‌తో దొరికిపోయిన మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఉద్యోగి..!

ఇయర్ వేడుకులకు సిద్ధమయ్యారు. ఈ రాత్రి ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నారు. మత్తులో తూగేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కావాల్సిన సరుకు తెచ్చి పెట్టుకున్నారు..
అయితే ఈ ప్లాన్ తిరగబడిండి. ఫలితంగా జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జరిగింది.

ఆమె ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. నెలకు లక్షల్లో జీతం. మందు, విందు, చిందులతో జీవితం. ఇన్ని రోజులు ఒక లెక్క. ఈ రోజు మరో లెక్క అనుకున్నారు. ఎలాగైనా ఈ ఇయర్ ఎండింగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేయాలనుకున్నారు. ఇందుకు పక్కా ప్లాన్ వేశారు. మందు, మాంసంతో పాటు డ్రగ్స్‌ను సిద్ధంచేసుకున్నారు. రాజేంద్రనగర్‌ శివరాంపల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌లో సెలబ్రేషన్ ఏర్పాట్లు చేశారు. ఇంతలో పోలీసులు అనూహ్యంగా షాక్ ఇచ్చారు. అపార్ట్‌మెంట్‌లో రైడ్ చేశారు. దీంతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సంధ్య రెడ్ హ్యాండెండ్‌గా దొరికిపోయారు. ఈ నైట్ ఇయర్ ఎండింగ్ సెల్రబేషన్‌లో ఫుల్ ఎంజాయ్ చేసేందుకు డ్రగ్స్‌ను బెంగళూరు నుంచి తెప్పించారు. స్నేహితులు అర్జున్, డేవిడ్‌తో కలిసి పక్కాగా ప్లాన్ చేశారు. కానీ ప్లాన్ బెడిసికొట్టింది. ఎస్‌ఓటీ పోలీసుల తనిఖీల్లో ఈ ప్లాన్ మొత్తం బయటపడింది. 2.7 గ్రాముల ఎమ్డీఎమ్ఏ డ్రగ్స్‌ను గుర్తించారు. సంధ్యతో పాటు స్నేహితులు అర్జున్, డేవిన్‌ను అరెస్ట్ చేశారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

యువత మత్త పదార్థాలకు అలవాటు పడొద్దని.. దాని వల్ల ప్రమాదంలో పడతారని పోలీసులు తెలిపారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్‌ను సాధారణంగా జరుపుకోవాలని.. డ్రగ్స్‌ను వినియోగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు..