కర్ణాటకలో కుప్పకూలిన DRDO డ్రోన్..

*బెంగళూరు భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి విభాగానికి సంబంధించిన డ్రోన్ (అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికిల్-UAV) ఒకటి ఆదివారం ఉదయం కుప్పకూలింది..

కర్ణాటక రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రోన్పై TAPAS-07A-14 నంబర్ ఉంది. ఒక్కసారిగా పంట పొలాల్లో డ్రోన్ కుప్పకూలడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వారు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, డీఆర్డీవో అధికారులు ఘటనా ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనలో డ్రోన్ పూర్తిగా ధ్వంసమైంది. ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు..