మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి అర్థం చేసుకోండి..పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో లేదో టెస్టులు చేయాలి… నటి కుషిత…

తాజాగా నటి కుషిత పేరు కూడా బయటపడటంతో ఈ వ్యవహారంపై ఆమె స్పందించారు...

తాజాగా నటి కుషిత పేరు కూడా బయటపడటంతో ఈ వ్యవహారంపై ఆమె స్పందించారు….

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న ఫుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌పై పోలీసుల దాడుల్లో డ్రగ్స్ కోణం బయటపడిన సంగతి తెలిసిందే. లేట్ నైట్ జరిగిన రేవ్ పార్టీలో పలువురు బడా ఫ్యామిలీల పిల్లలంతా ఒక్కచోట చేరి డ్రగ్స్ మత్తులో ఎంజాయ్ చేశారనే ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే రాహుల్ సిప్లిగంజ్, నిహారిక కొణిదెల, పలువురు రాజకీయ నేతల కుమారుల పేర్లు బయటకొచ్చాయి…

నా పేరు కుషిత. పార్టీకి వెళ్లింది నిజమే. ఆ సమయంలో పోలీసులు వచ్చారు. అది వాళ్ల డ్యూటీ. వచ్చిచెక్ చేశారు. అయితే అక్కడ ఏం చేయకపోయినా నా పేరు, ఫోటోలు బయటపెడుతున్నారు. దయచేసి అర్థం చేసుకోండి.. నిజమేంటో తెలుసుకోండి.
నిజమేంటో తెలుసుకోకుండా దొరికిపోయింది…
బయటపడింది అంటూ ప్రచారం చేయొద్దు.
మాకు ఫ్యామిలీస్ ఉన్నాయి అర్థం చేసుకోండి.
మా పేరు పాడుచేయడానికి ఇలాంటి ప్రచారం చేయొద్దు.
పబ్ ఓపెన్ ఉంది కాబట్టి వెళ్లాం.
అంతవరకే పోలీసులు బ్లడ్ శాంపిల్స్ తీసుకుని ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో లేదో టెస్టులు చేయాలి.’ అని కుషిత పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు…