విమానం ఆకారంలో ఉన్న ఓ విదేశీ డ్రోన్ శ్రీకాకుళంలోని భావనపాడు సముద్రతీరంలో కలకలం సృష్టించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులకు ఈ డ్రోన్ కనిపించడంతో అధికారులు మెరైన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో రంగంలోకి దిగిన అధికారులు అక్కడికి చేరుకుని డ్రోన్ ను స్వాధీనం చేసుకున్నారు. విమానం ఆకారంలో ఉన్న ఆ డ్రోన్ సుమారు 9 అడుగుల పొడవుతో.. 111 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. అలాగే BANSHEE TARGET అనే అక్షరాలు, 8001 నంబర్ రాసి ఉందని అధికారులు తెలిపారు. కాగా.. ఆ విమానాన్ని పరిశీలించిన మెరైన్ పోలీసులు మిలటరీ డ్రోన్ గా అనుమానిస్తున్నారు.
మానవరహిత డ్రోన్. దానిపై టార్గెట్ బన్షీ అంటూ స్టిక్కర్లు ఉండటంతో.. మెరైన్ అధికారులకు సమాచారం ఇచ్చారు స్థానిక అధికారులు. దీంతో విమానాన్ని పోలిన ఆ డ్రోన్‌ను పరిశీలిస్తున్నారు కోస్ట్‌గార్డ్ అధికారులు. వేరే దేశం నుంచి వచ్చి ఉంటుందా..దీన్ని ఎవరు ప్రయోగించారు అన్న కోణంలోనూ విచారించారు. అయితే ఈ డ్రోన్ భారత్‌కు చెందినదేనని.. ఆందోళన అవసరం లేదంటున్నారు పోలీసులు. ఆర్మీ లేదా నేవీకి చెందినది అయ్యిండొచ్చని.. ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామన్నారు…గతంలో టార్గెట్ టెక్నాలజీ బన్షీ & మెగ్గిట్ బాన్షీ 1980లలో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ శిక్షణ కోసం అభివృద్ధి చేసిన బ్రిటిష్ టార్గెట్ డ్రోన్. ఈ మానవ రహిత విమానాన్ని బన్షీని టార్గెట్ టెక్నాలజీ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. కంపెనీ డ్రోన్‌ల కోసం తేలికపాటి ఇంజిన్‌లలో ప్రత్యేకతను కలిగి ఉంది. 1983లో దాని స్వంత డిజైన్‌ను అభివృద్ధి చేసింది. బన్షీ అనేది టెయిల్‌లెస్ డెల్టా వింగ్ ప్లాన్‌ఫారమ్‌తో ఎక్కువగా కాంపోజిట్ మెటీరియల్ (కెవ్లర్, గ్లాస్-రీన్‌ఫోర్స్డ్ ప్లాస్టిక్)తో నిర్మించబడింది. మొదటి మోడల్‌లు 26 hp 342 cc నార్మలైర్-గారెట్ టూ-సిలిండర్ టూ-స్ట్రోక్ డ్రైవింగ్‌ను పుషర్ ప్రొపెల్లర్‌ని ఉపయోగించాయి. 1-3 గంటల వరకు ఓర్పుతో 35-185 kt పనితీరు ఉంది. విమాన నియంత్రణ రెండు ఎలివోన్‌ల ద్వారా ఉంటుంది. 185 కి.టి. తరువాతి నమూనాలు నార్టన్ P73 రోటరీ ఇంజిన్‌లను ఉపయోగించాయి
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.

Welcome to R9 Telugu News : Get Latest and Breaking News in Telugu, Top News Headlines from Hyderabad and Telangana at our flagship website r9telugunews.com Read Latest Telugu Daily News, Andhrapradesh, Telangana, India, World, Business, Sports, Entertainment News updtes...