మాజీ ఎంపీ డీ శ్రీనివాస్ కాంగ్రెస్ లో చేరికపై ఆయన కుటుంబంలో చిచ్చు రేగినట్లు తెలుస్తోంది. మార్చి 26వ తేదీన ఆదివారం కాంగ్రెస్ లో డీ శ్రీనివాస్, ఆయన కుమారుడు సంజయ్ చేరారు. అయితే మార్చి 27వ తేదీ సోమవారం డీఎస్ రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన రాజీనామా లేఖను రాస్తున్న వీడియోను విడదల చేశారు.
డీఎస్ రాజీనామా లేఖలు బీజేపీ ఎంపీ చేస్తున్న డర్టీ పాలిటిక్స్ అని అన్నారు.. ధర్మపురి సంజయ్. అహంకారంతో బ్లాక్‌మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ఎంపీ అర్వింద్ దిగజారి వ్యవహరిస్తున్నారని, అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎలాంటి లేఖలు నమ్మొద్దని సూచించారు. కాంగ్రెస్‌లో చేరడం తన తండ్రి కోరిక అని చెప్పిన డి.సంజయ్… నిన్న అందరి సమక్షంలో డీఎస్ సంతోషంగా కండువా కప్పుకున్నారని గుర్తుచేశారు. ఎంపీ అర్వింద్ ఇబ్బందుల వల్లే.. డీఎస్ కాంగ్రెస్‌లో చేరికకు ఇన్ని రోజులు ఆలస్యం జరిగిందని చెప్పారు డి.సంజయ్…
రాజీనామా పై భార్య వీడియో లో..
డీ శ్రీనివాస్ రాజీనామా విషయాన్ని ఆయన భార్య విజయలక్ష్మీ వీడియో ద్వారా వెల్లడించారు. నమస్తే ఇది డీ శ్రీనివాస్ రాజీమానా ..నేను చెప్పదల్చుకున్నది ఏంటీ అంటే కాంగ్రెస్ వాళ్లు కానీ..మీడియా వాళ్లు కానీ ఇటువైపు రాకండి..అని డీ విజయలక్ష్మీ వీడియోలో స్పష్టం చేశారు.
రాజకీయాలకు దూరంగా..ఉండాలనుకుంటున్నా..!
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు..డీఎస్ ను పార్టీలో చేర్చుకునే విధానం ఇది కాదు..డీఎస్ అనారోగ్యంతో ఉన్నారు. మీ రాజకీయాలకు డీఎస్ ను వాడుకోవద్దని డీఎస్ భార్య విజయలక్ష్మీ స్పష్టం చేశారు. అటు క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు డీఎస్ తెలిపారు. తనను వివాదాల్లోకి లాగొద్దని డీఎస్ విజ్ఞప్తి చేశారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదినేనని స్పష్టం చేశారు..