గందరగోళంగా డీఎస్సీ.. అభ్యర్థుల అవస్థలు..

ఉపాధ్యాయ నియామక పరీక్ష(డీఎస్సీ)కు దరఖాస్తుకు అభ్యర్థులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ఈ నెల 12, 13 తేదీల్లో దాదాపు 30 వేల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. వీరికి ఈడబ్యూఎస్ కోటా, పరీక్ష కేంద్రం వంటివి చూపించలేదు.

అయితే, ఈ నెల 22తో దరఖాస్తు ముగుస్తుండ టంతో.. వీరందరూ మళ్లీ దరఖాస్తు చేయాలా? లేదా ప్రభుత్వం ఈ లోపాలను సరిచేసుకునేందుకు ఎడిట్ ఆప్షన్ ఇస్తుందా? అనేదానిపై స్పష్టత ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు…

విడపనకల్లు మండలం గడేకల్లు వద్ద 67వ జాతీయ రహదారిపై సోమవారం గడేకల్లు గ్రామస్థులు రాస్తారోకో చేపట్టారు. జాతీయ రహదారి పనులు అర్థంతరంగా నిలిపివేయటంపై నిరసన చేపట్టారు. అసంపూర్తి రోడ్డు పనులతో దుమ్ము, ధూళితో అనారోగ్యం పాలవుతున్నామని జాతీయ రహదారిపై రెండువైపులా వాహనాలు అపి నిరసన తెలిపారు. సమస్య పరిష్కారించేంత వరకు కదిలేది లేదంటున్న గ్రామస్థులు రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు నిరసనను అడ్డుకునే యత్నం చేశారు.