డీఎస్సీ నోటిఫికేషన్‌, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన ..!

త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్‌, తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. టీచర్‌ పోస్టుల భర్తీకి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తామని వెల్లడించారు. మొత్తంగా 6,500 పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌పై రెండ్రోజుల్లో విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. కార్పొరేట్‌ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

తెలంగాణలో టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక ప్రకటన చేశారు. 6,500 పోస్టుల భర్తీకి TS DSC Notification 2023 నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో పాఠశాల విద్యలో 5,089, స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూళ్లలో 1,523 పోస్టులు ఉన్నట్లు చెప్పారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా DSC ద్వారానే పోస్టుల భర్తీ చేస్తామని పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి రెండు రోజుల్లోనే TS DSC Notification 2023, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండు రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేస్తారన్నారు..