దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్న కొడుకును , తల్లి అడిగిన వింత కానుక 10 కిలోల టమాటాలు.!!.

విదేశాల్లో ఉన్న మనవాళ్లు ఇండియా వస్తూ ఏం బహుమతి కావాలి అంటే.. మనకి ఇష్టమైనవి చెబుతాం.. కానీ ఓ తల్లి తన కూతుర్ని 10 కిలోల టమాటాలు అక్కడి నుంచి తీసుకురమ్మని బహుమతి అడిగింది. ఇండియాలో టమాటా రేట్ల పెరుగుదల ప్రభావం ఈ రేంజ్‌లో ఉందన్నమాట.

ప్రస్తుతం సోషల్ మీడియాలో టమాటా పై రకరకాల ట్రోల్స్ రన్ అవుతోంది…టమాటా ధరలు భారీగా పెరిగాకా విచిత్రమైన కథనాలు వైరల్ అవుతున్నాయి. టమాటాల దొంగతనాల దగ్గర్నుంచి రీల్స్, వీడియోలు ఫుల్ హంగామా నడుస్తోంది. అయితే దుబాయ్‌లో ఉంటున్న తన సోదరి ఇండియా వస్తున్న సందర్భంలో తన తల్లి అడిగిన వింత కానుకను @Full_Meals అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో షేర్ చేసింది. ‘మా సోదరి తన పిల్లల వేసవి సెలవుల కోసం దుబాయ్ నుంచి ఇండియాకి వస్తోంది.. దుబాయ్ నుంచి ఏమైనా కావాలా? అని మా అమ్మను అడిగినపుడు ఆమె 10 కిలోల టమాటాలు తీసుకురండి అని చెప్పారు. తను నిజంగానే 10 కేజీల టమాటాలను ప్యాక్ చేసి పంపింది.. నేనేమంటానంటే…’ అనే శీర్షికతో పోస్ట్ చేసింది…