ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించారు.

తెలంగాణ అతిపెద్ద సంప్రదాయ బతుకమ్మ పండుగకు అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనమైన.. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫాపై బతుకమ్మను ప్రదర్శించారు. బుర్జ్ ఖలీఫా స్ర్కీన్ పై ఫెస్టివల్ ఆఫ్ ఫ్లవర్స్ బతుకమ్మ, జై జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర మ్యాప్ , జై కేసీఆర్ అని ప్రదర్శించారు. దేశ విదేశాలకు చెందిన లక్షలాది మంది ఒకేసారి  అతిపెద్ద బుర్జ్ ఖలీఫా స్ర్కీన్ పై ప్రదర్శించిన బతుకమ్మ వీడియోను చూశారు.