Eagle Movie Review | ‘ఈగల్’ – మూవీ రివ్యూ

Eagle Movie Review..
‘ఈగల్’ – మూవీ రివ్యూ..

నటీనటులు: రవితేజ – కావ్య థాపర్ – అనుపమ పరమేశ్వరన్ – వినయ్ రాయ్ – నవదీప్- శ్రీనివాస్ అవసరాల- మధుబాల -నవదీప్ – శ్రీనివాసరెడ్డి – అజయ్ ఘోష్ తదితరులు

సంగీతం: డేవ్ జాండ్

ఛాయాగ్రహణం: కార్తీక్ ఘట్టమనేని – కర్మ్ చావ్లా – కామిల్ ప్లాకి

కథ: కార్తీక్ ఘట్టమనేని

మాటలు: మణిబాబు కరణం

స్క్రీన్ ప్లే: కార్తీక్ ఘట్టమనేని – మణిబాబు కరణం.

నిర్మాతలు: టీజీ వివ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల

సంగీతం: దవ్జాండ్

కథ: ఢీలీలో జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) తలకోనలో ఉత్పత్తయ్యే ప్రత్తి గురించి ఓ చిన్న వ్యాసం రాస్తుంది. అయితే అది పెద్ద దుమారం రేపడంతోపాటు నేషనల్ ఇంటిలిజెన్స్ బ్యూరో రంగంలోకి దిగుతుంది. అధికారులు నళినిని కొన్ని గంటలపాటు ఇంటరాగేట్ చేస్తారు. ఎక్కడో తలకోనలో ప్రత్తి గురించి రాస్తే ఢిల్లీలోని ఐబీ ఎందుకు స్పందించింది? అనే విషయమై నళిని పరిశోధన చేస్తుంది. తన దర్యాప్తులో భాగంగా దీనికి మూలకారకుడు సహదేవ్ (రవితేజ) అని తెలుస్తుంది. .

ఐతే ఈ ఫ్యాక్టరీ ఉన్న ప్రాంతంలోనే బాక్సైట్ గనులు ఉన్నాయని తెలిసి ఆ ప్రాంత ఎమ్మెల్యేతో పాటు ఒక వ్యాపారవేత్త కన్ను దానిపై పడుతుంది. ఎలాగైనా సహదేవ్ ను.. అక్కడి రైతులను అక్కడి నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతాన్ని చెరబట్టాలని చూస్తారు. కానీ పైగా మామూలు వ్యక్తిలా కనిపించే సహదేవ్ వెనుక వేరే కథ ఉంటుంది. అతడికి ‘ఈగల్’ అనే మరో రూపం కూడా ఉంటుంది. ఆ కథేంటి.. ఆ రూపమేంటి.. తనను అంతం చేయాలని వచ్చిన వాళ్లను సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు.. ఈ విషయాలన్నీ తెర మీదే చూసి తెలుసుకోవాలి…..

ఒక గిరిజన తండాలో సహదేవ వర్మ (రవితేజ )విగ్రహాన్ని పెట్టుకొని అతన్ని దేవుడిలా కొలుస్తూ ఉంటారు.. అతని ఎవరు? ఆ ఊరికి ఏం చేశాడు? అనే విషయాలు తెలుసుకోవడానికి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ జర్నలిస్టుగా ఎంటర్ అవుతుంది అనుపమ పరమేశ్వరన్. ఈ పాయింట్ తోనే సినిమా ఇంట్రెస్ట్ గా సినిమా మొదలవుతుంది. అయితే ఫస్టాఫ్ మొత్తం కూడా ఎక్కువ మొత్తంలో డైలాగ్స్, ఎలివేషన్స్ సీన్స్ తోనే నింపేశారు. ఇక సెకండాఫ్ లో తన రేంజ్ యాక్షన్ సీన్స్ తో ఫాన్స్ కి కావాల్సినంత బూస్టింగ్ ఇచ్చాడని చెప్పవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈగల్ మూవీ ద్వారా రవితేజ యాక్షన్ సీన్స్ ను కళ్ళ ముందు చూపించారు డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని. మొదటి భాగం కాస్త సాగదీతగా అనిపించినా, ఎలివేషన్ సీన్స్ కాస్త బోర్ కొట్టిన కానీ సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్ గా, 40 నిమిషాల క్లైమాక్స్ ఎమోషనల్ గా ముగుస్తుంది….

రవితేజ డైలాగ్స్:

మొదటి భాగంలో రవితేజ డైలాగ్స్ ఎంతో ఆకట్టుకున్నాయి…

టెక్నీషియన్స్:

డైరెక్టర్ స్వతహాగా సినిమాటోగ్రాఫర్ కావడంతో ఈ విషయంలో చాలా కేర్ తీసుకున్నాడు. సినిమాకు తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదని చెప్పవచ్చు. అంతేకాకుండా దావుజాంద్ ఇచ్చినటువంటి సంగీతం కొన్ని కొన్ని సీన్స్ లో తేలిపోయింది.

ప్లస్ పాయింట్స్:

రవితేజ నటన

యాక్షన్ సీన్స్

డైలాగ్స్

క్లైమాక్స్

డైరెక్షన్.

మైనస్ పాయింట్స్ :

ఫస్టాఫ్ సాగదీత.

కావ్య థాపర్ నిడివి తక్కువ ఉండడం..