లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌అరుణ్‌ గోయెల్‌ కీలక నిర్ణయం..!

*ఢిల్లీ..

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్‌అరుణ్‌ గోయెల్‌ కీలక నిర్ణయం ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తక్షణమే ఆమోదించారు.

ఈ విషయాన్ని కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇక మిగిలింది ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌ మాత్రమే మిగిలి ఉన్నారు.

మార్చి 15 వ తేదీన సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో అరుణ్ గోయల్ రాజీనామా దేశ వ్యాప్తంగా సంచలన చర్చకు దారితీసినది..